15 August, 2026 | 6:11 PM

కామారెడ్డిలో చోరీ కేసు ను చేదించిన పోలీసులు

15-08-2026 05:27 PM

16 తులాల బంగారు నగలు,50 వేల నగదు స్వాధీనం 

చోరీకి పాల్పడిన నిందితుని అరెస్టు రిమాండ్ 

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కామారెడ్డిలో ఇటీవల జరిగిన భారీ చోరీ చేసిన కామారెడ్డి పోలీసులు చేదించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారీ దొంగతనం కేసులో నిందితున్ని పట్టుకొని అరెస్టు చేసినట్లు వాటి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి విద్యుత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మామిండ్ల స్వప్న ఈనెల 7న ఇంటికి తాళం వేసి కామారెడ్డి లో ఉంటున్న తల్లిగారింటికి వెళ్ళింది. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోనే బీరువా లోని వస్తువులు చిందర వందర పడి ఉండడంతో దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగు ప్రత్యేక బృందాలు గా  ఏర్పడి చోరీ కేసు చేదించినట్లు ఎస్పీ వెల్లడించారు. 16 తులాల బంగారు నగలు, 50వేల నగదును దేవుని పల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు. అప్పులు కావడంతో శ్రీనివాస్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి చోరీకి గురైన బంగారభరణాలు, నగదు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా పని చేసిన కామారెడ్డి డిఎస్పి మధుసూదన్, కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిసిఎస్ ఎస్ఐ మహేష్ తో పాటు సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీ ంత్ దేవునిపల్లి సిబ్బంది రవికిరణ్, రవి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.