10 July, 2026 | 3:07 AM

గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

10-07-2026 02:03 AM

పోచారం ప్రాజెక్టు నిండాలని మొక్కులు మొక్కిన మాజీ జెడ్పీటీసీ

నాగిరెడ్డిపేట,జూలై 9 (విజయ క్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న  గంగమ్మ దేవత అమ్మవారికి నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి, మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు నిండు కుండలా నిండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ఐదు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు.

పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన అనంతరం 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటానని తెలిపారు.ప్రతి ఏడాది ఇదే విధంగా గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరి రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించారు.

నాగిరెడ్డి పేట మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి గత 20 సంవత్సరాల నుండి పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభం ముందు ఐదు కొబ్బరికాయలు కొట్టి పోచారం ప్రాజెక్టు నిండిన అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది.ఆయన వెంట రైతులు ఉన్నారు.