1 September, 2026 | 1:48 AM

విముక్త జాతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

01-09-2026 12:13 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): విముక్త జాతుల ప్రజల విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధికి ప్రభు త్వం తరఫున ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన విముక్త జాతుల దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, డీఆర్‌ఓ దాసరి వేణుతో కలిసి పాల్గొన్నారు.

విముక్త జా తుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గూడు కల్పించడంతోపాటు పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వారి సంప్రదాయ వృత్తులు, కళలు, జానపద సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నదీమ్, గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, విముక్త జాతుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.