కృష్ణా జలాల అక్రమ దోపిడీ మౌనం.. తీరని ద్రోహం
- పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ ద్రోహం
- ప్రేక్షకపాత్ర వహిస్తున్న కేఆర్‌ఎంబీ .. తక్షణమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి
- మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు(Floodwaters) రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project) ద్వారా ఏపీ ప్రభుత్వం(AP Government) బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహమని మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao.) మండిపడ్డారు. ఏపీ అడ్డగోలుగా నీటి దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం ద్వారా తెలంగాణ రైతాంగానికి చేస్తున్న మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా హరీష్‌రావు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని, ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, యథేచ్చగా నీటిని తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ ద్వారా తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్ర భుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రో హమని, తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీ ఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందు కు సహకరిస్తున్నారని నిలదీశారు.
ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవే క్షించాల్సిన కేఆర్‌ఎంబీ సైతం పట్టనట్లు వ్య వహరించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల ను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషి స్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని, కేఆర్‌ఎంబీపై ఒత్తి డి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రా జెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫ రా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇంకెంతమంది బలి కావాలి?
గురుకులంలో చదివి, పేదరికాన్ని జ యించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని, హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరిం త ఆందోళన కలిగిస్తున్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు రాష్ట్రం లో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుం టే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని, హోం శాఖను కూ డా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై స మగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని, రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరి చేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.






