1 September, 2026 | 2:27 AM

రుణాల పేరిట బ్యాంకుల లూటీ!

01-09-2026 01:30 AM
  1. రూ.3 లక్షల కోట్లు ఎగవేత!
  2. బ్యాంకుల మెడకు వేలకోట్ల లోన్ల ఉచ్చు
  3. బడా రుణగ్రహీతల కుచ్చుటోపీలు
  4. దేశంలో కుదేలవుతున్న బ్యాంకులు
  5. అగ్రస్థానంలో పీఎన్‌బీ, ఎస్‌బీఐలు
  6. రెండు బ్యాంకుల పరిధిలోనే రూ.1.70 లక్షల కోట్ల ఎగవేత
  7.    1000 కోట్లకు పైగా ఎగవేతల జాబితాలో 23 బ్యాంకులు
  8.    100 కోట్లకుపైగా ఎగవేతలున్న బ్యాంకులు 45

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): దేశంలో బడా వ్యాపారులు(Big businessmen), పారిశ్రామిక వేత్తలు(Industrialists) రుణాల ఎగవేతకు పాల్పడు తుండటం.. అంతిమంగా అవి బ్యాంకుల(Banks) మెడకు గుదిబండలా మారుతున్నాయి. వేల కోట్ల రుణగ్రహీతలు చేతులు ఎత్తేయడంతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. విల్ఫుల్ డిఫాల్టర్ల(Wilful defaulters) వేలకోట్ల పంగనామాలతో పీఎన్‌బీ, ఎస్‌బీఐలు  అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు బ్యాంకుల పరిధిలోనే రూ.1.70 లక్షల కో ట్లను రుణగ్రహీతలు ఉద్దేశపూర్వగానే ఎగగొట్టారు.

100 కోట్లకుపైగా ఎగవేతలున్న బ్యాం కులు 45, రూ.1000 కోట్లకు పైగా ఎగవేతల జాబితాలో 23 బ్యాంకులు ఉన్నాయం టే దేశంలో బ్యాంకులను కొందరు కోటీశ్వ ర్లు ఎలా బురిడీ కొట్టిస్తున్నారో.. అర్థమవుతోంది. బ్యాంకులకు దాదాపు రూ.25 లక్షల వరకు ఎగవేతలున్న మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లను బడా వ్యాపారులు కుచ్చుటోపీ పెట్టారు. దీంతో దేశంలో రుణా ల ఎగవేతలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

బ్యా ంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని.. అటు తరువాత కోర్టుల (ఎన్‌సీఎల్ టీ)ను ఆశ్రయించి దివాలా పిటిషన్లు వేయ డం ఏదో నామమాత్రంగా చేతులు దులిపేసుకుంటున్న వారి సంఖ్య దేశంలో ప్రతిఏ టా పెరుగుతున్నట్లు సమాచారం. తాజాగా జీ/ఎస్సెల్ సంస్థ అధిపతి వ్యక్తిగత హామీదారుగా ఉంటూ రూ.22,006.57 కోట్ల రుణా లు తాను చెల్లించలేనంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో.. చివరికి 6.5 కోట్లు చెల్లించడానికి ట్రిబ్యునల్ అంగీకరించింది.

బడావ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రుణాల ఎగవేతకు పాల్పడుతుండట ం.. అంతిమంగా అవి బ్యాంకుల మెడకు గు దిబండలా మారుతున్నాయి. వ్యక్తిగతంగా ఏ యే సంస్థలు, భారీ పారిశ్రామిక వేత్తలు, వ్యా పారులు ఎంతమేర రుణాలను ఎగవేశారనే అంకెలు మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్రగా చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇవన్నీ ఆయా సంస్థలు, వ్యాపారుల పరంగా ఉన్న అంకెలు.

అయితే బ్యాంకుల పరిధిలో జరిగి ఈ మొత్తం ఎగవేతలు ఎంత వరకు ఉండవచ్చనే చర్చకూడా మొదలయ్యింది. ఇలాంటి బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రు ణాలు తీసుకుని చివరికి ఎగ్గొట్టడంతో (దివా లా) అంతిమంగా బ్యాంకుల మెడకు చుట్టుకుంటున్నాయి. ఇవి ఎంత వరకు ఉంటాయ నే చర్చ జరుగుతోంది.

100 కోట్లకుపైగా ఎగవేతలున్న బ్యాంకులు 45

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల పరిధిలో ఎగవేతలు ఎంత వరకు ఉండవచ్చనే సమాచారాన్ని వాచ్‌ఔట్ ఇన్వెస్టర్స్ డాట్ కామ్ అ నే సంస్థ జాబితా తయారు చేసింది. ఇందు లో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువగా ఎగవేతల మొత్తం (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఉన్న బ్యాంకులు మొత్తం 45 వరకు ఉన్నట్టుగా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో జాబితాను పొందుపర్చిం ది. ఇలా రూ.25 లక్షల మొత్తం ఎగవేతలతో ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల జాబితాను వాచ్‌ఔట్‌ఇన్వెస్టర్స్ డాట్ కాం సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈ జాబితా 2025 డిసెంబర్ 31 నాటికి సిద్ధంచేసినట్టుగా కూ డా అందులో పేర్కొంది.

ఒక్కోటి రూ.80 వేల కోట్లకుపైగా ఎగవేతలు

సదరు సంస్థ ప్రచురించిన గణాంకాలను బట్టి పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధికంగా ఎగవేతల మొత్తాన్ని మోస్తున్న బ్యాంకులు పం జాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లు అగ్రస్థానం లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. పీఎన్‌బీ పరిధిలో ఇలా రుణాల ఎగవేతల మొత్తం రూ.89, 675.93 కోట్లు ఉండటం గమనార్హం. అలా గే ఎస్‌బీఐ పరిధిలో రూ.81,087.08 కోట్లు ఉన్నాయి.

అంటే ఈ రెండు బ్యాంకుల పరిధిలోనే సుమారు 1.70 లక్షల కోట్లకుపైగా మొత్తాన్ని ఎగవేతల రూపంలో ఆ రెండు బ్యాంకులు భారాన్ని మోస్తున్నాయని స్పష్టం అవుతోంది. ఇవన్నీ.. ఆయా బ్యాంకుల నుం చి బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రుణాలు తీసుకుని ఎగవేసినట్టుగా చెప్పుకోవచ్చు. పీఎన్‌బీ, ఎస్‌బీఐలే కాకుండా.. రూ.10 వేల కోట్లకుపైగా ఎగవేతల మొత్తం తో.. మరో 6 బ్యాంకులు  ఉన్నాయి.

ఇందు లో రూ.35,218.79 కోట్లతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మూడో స్థానంలో ఉండగా.. రూ.26,299.03 కోట్ల తో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నాలుగో స్థానంలో, రూ.24,040.32 కోట్లతో కెనరా బ్యాంక్ ఐదోస్థానంలో, రూ.13,412.64 కో ట్లతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరో స్థానం లో, రూ. 11,703.16 కోట్లతో యూకో బ్యాం క్ ఏడో స్థానంలో, రూ.10,093 కోట్లతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎనిమిదో స్థాన ంలో ఉన్నాయని ఆ సంస్థ తేల్చింది. 

రూ. 2.67 లక్షల కోట్లు..

ఈ వెబ్‌సైట్‌లో పెట్టిన జాబితాను పరిశీలిస్తే.. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ ఎగవేతల బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల గణాంకాలన్నీ కలిపితే.. సుమారు రూ.2.67 లక్షల కోట్లుగా తేల్చడం గమనార్హం. ఇందులో అగ్రస్థానంలో ఉన్న రెండు బ్యాంకుల (పీఎన్‌బీ, ఎస్‌బీఐ) పరిధిలో ఉన్న మొత్తమే రూ.1.70 లక్షల కోట్లు కాగా.. మిగిలిన 43 బ్యాంకులన్నీ కలిపి సుమారు రూ.97 వేల కోట్ల ఎగవేతల మొత్తం ఉన్నట్టు తేల్చింది.

ఇక రూ. 100 కోట్లకంటే తక్కువ ఎగవేతల మొత్తంలో ఉన్న బ్యాంకులు మరో 45కిపైగా ఉన్నాయి. నిజానికి ఈ వెబ్‌సైట్‌లో రూ.25 లక్షల వరకు రుణాల ఎగవేత ల మొత్తం ఉన్న బ్యాంకుల జాబితానే పొం దుపర్చారు. అంతకంటే దిగువన ఉన్న బ్యాంకులు కూడా చాలా ఉన్నాయని సమాచారం. ఇవన్నీ కలుపుకుంటే..లోన్ల ఎగవేత సుమారు రూ.3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.

బడా వ్యాపారుల వలలో.. బ్యాంకులు

అందిన సమాచారాన్ని బట్టి పరిశీలిస్తే.. దేశ వ్యాప్తంగా రూ.100 కోట్లకంటే ఎక్కువ రుణాల ఎగవేతలతో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ కూడా బడా వ్యాపారులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలే ఉన్నట్టుగా తేలుతోంది. తాజా ఎస్సెల్/జీ సంస్థ ఫౌండర్ సుభాస్ చంద్ర ఉదంతంలో మొత్తం రూ.22006.57 కోట్ల రుణాలకు.. వ్యక్తిగతంగా దివాలా పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ కేవలం రూ.6.5 కోట్లతో సరిపుచ్చడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సంస్థ లు దివాలా పేరుతో ఎగవేసిన మొత్తాల గ ణాంకాలు మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన గణాంకాల మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లు కాగా.. ఇవన్నీ కూడా బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లోన్ల ఉచ్చులు బ్యాంకుల మెడకు గుదిబండలా మారుతున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. వాచ్ ఔట్ ఇన్వెస్టర్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న జాబితా ప్రకారం.. టాప్ 10లో ఉన్న ఎగవేతల మొ త్తం, (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఉన్న బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.