1 September, 2026 | 4:24 AM

బహుజన తెలంగాణ కావాలి

01-09-2026 01:14 AM
  1. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకే ముందుకు వచ్చా
  2. తండ్రి, కూతురును పాపిన ప్రశాంత్‌రెడ్డిని క్షమించను 
  3. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
  4. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): బంగారు తెలంగాణ కాదు బహుజ న తెలంగాణ కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలో పాంచ జన్య సదస్సు, ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన స మావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తేవాలన్న సంక ల్పంతో ముందుకు వచ్చానని చెప్పారు. ఏ తప్పు చేయకుండానే తనను జైల్లో పెట్టారు అని తెలిపారు.

అప్పుడే తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పానని, నాలుగేళ్లు ఈడీ, సీబీఐ ఇబ్బంది పెట్టినా ధైర్యం సడల లేదని, తానుదారి తప్పలేదు అని పేర్కొన్నారు. పుట్టి న ఇంటి నుంచి పొమ్మంటే సొంతూరు వ చ్చాక ఆపుకుందామన్న కన్నీళ్లు ఆగడం లేదన్నారు. అలాగాని తాను పిరికిదాన్ని కాదన్నా రు. అమ్మ ఇంటి వాళ్లు నిర్దాక్షిణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్నబిడ్డలా అక్కున చే ర్చుకున్నారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

తండ్రీ కూతురును పాపిన ప్రశాం త్‌రెడ్డిని జీవితంలో క్షమించనని వెల్లడించారు. తన ఉసురు ఆయనకు తప్పకుండా తగులుతుంది అన్నారు. ఒకవైపు కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూనే టీఆర్‌ఎస్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీ సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తాం అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఐదు సీట్లు తమ పార్టీ గెలుస్తుంనదని అన్నారు. 

తెలంగాణ వస్తే మన బతుకులు మారాతాయని ఊపిరిబిగపట్టి, పిడికిలెత్తి పోరాటం చే శామన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌కు అధికా రం ఇస్తే లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారు, కానీ నిజామాబాద్‌కు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కూడా మనకు మంచి జరగలేదని, అలాంటప్పుడు మనకు మంచి జరిగేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వాన్ని నిలదీస్తాం

కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి రేపటితో వెయ్యి రోజులు అవుతుందని కవిత పేర్కొన్నారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన  వా ళ్ల ను మనం నిలదీయాలా వద్దా? కాంగ్రెస్‌ని నిలదీయాల్సింది బీఆర్‌ఎస్ ఎందుకు మౌ నంగా ఉంది? అని ప్రశ్నించారు.  ప్రశాంత్‌రెడ్డిని కేసీఆర్ పెద్ద కొడుకు మాదిరిగా ఆద రించి ఇంట్లో కూర్చో బెట్టుకొని ఎన్నోసార్లు భోజనం పెట్టారన్నారు.  తండ్రిని, కూతురును పాపటంలో ప్రశాంత్‌రెడ్డిదే మొదటి పాత్ర.

హరీశ్‌రావును, సంతోష్‌రావును క్షమిస్తానేమో గానీ ప్రశాంత్‌రెడ్డిని క్షమించ నన్నారు. బీఆర్‌ఎస్ ఓడిపోయిన రెండోరోజే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రశాంత్‌రెడ్డి ప్రయ త్నం చేసాడని ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్దన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిని తాను గె పి స్తే.. వారు తనను ఓడించారని ధ్వజమెత్తారు.