1 September, 2026 | 1:02 AM

దైవసన్నిధిలో భక్తిపారవశ్యం

01-09-2026 12:13 AM

రూ. లక్ష విలువైన విగ్రహ దాతలుగా నరసింహా నాయక్ దంపతులు

కోదాడ,(విజయ క్రాంతి):  బాలాజీ నగర్ లో శ్రీ మడేలయ్య స్వామి, సీతాలమ్మ దేవి, ఈదమ్మ తల్లి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సోమవారం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త భక్తులు భూక్యా నరసింహ నాయక్- రమాదేవి దంపతులు, వీరి సంతానం లోహితశ్రీ, త్రివేద్ నాయక్ లక్ష రూపాయల విలువైన విగ్రహ దాతలుగా వ్యవహరించి తమ ఉదారతను చాటుకున్నారు. స్వామి వార్ల అమ్మవార్ల నూతన విగ్రహాలను నరసింహ నాయక్ దంపతులు స్వయంగా ఆలయ కమిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా విగ్రహ దాత భూక్యా నరసింహ నాయక్ మాట్లాడుతూ.. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తరించారు.