1 September, 2026 | 3:18 AM

యుద్ధానికి ముగింపు పలకండి!

01-09-2026 01:10 AM
  1. మనవత్వాన్ని యుద్ధం వెనక్కు నెడుతుంది..
  2. శాంతిస్థాపనకు అన్నివిధాలా సహకరిస్తాం..
  3. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలి..
  4. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి
  5. బిష్షేక్ ‘ఎస్‌సీఓ’ శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాధినేతల భేటీ

బిష్సేక్, ఆగస్టు ౩౧: ఉక్రెయిన్‌పై యుద్ధాని కి ముగింపు పలకాలని, ఆ దిశగా ముందడు గు వేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని విజ్ఞప్తి చేశారు. అం దుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా మధ్య శతృత్వం సమసిపోయేందుకు కృషి చేస్తామని తెలిపారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్షేక్‌లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరా గ్ర సదస్సులో ఇరు దేశాధినేతలు సుమారు అరగంట వరకు భేటీ అయ్యారు.

ఈ ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం గురించి ప్రధానంగా చర్చించారు. భేటీలో మోదీ మాట్లాడుతూ.. నిరంత ర యుద్ధం చేయడమంటే మానవత్వాన్ని వెనక్కు నెట్టడమేనని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు ప్రబోధాలను అనుసరించి శాంతి స్థాపన దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పునరుద్ఘాటించారు.

తర్వాత పుతిన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పుతిన్ తన ప్రియ మిత్రుడని, ఎప్పుడూ తనను కలిసినా సంతోషంగా ఉంటుందని కొనియాడారు. ద్వైపాక్షిక సమావేశం పూర్తయిన తర్వాత ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించి బిష్కెక్ నగరంలోని అరేనా వరల్డ్ నొమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. కారులో పుతిన్‌తో ఉన్న చిత్రాన్ని మోదీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వీరద్దరి సరదా ప్రయాణాన్ని ‘కార్ డిప్లమసీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

దురాక్రమణను సహించం: మసూద్ పెజిష్కియాన్

భేటీలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, చర్చల ద్వారా శాంతినెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ, అమెరికా చర్చలు కోరుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా దాడుల జోలికి వెళ్లకుండా చర్చలకు వస్తే తమకు కూడా సంతోషమని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం స్పందించే తీరును బట్టి తాము కూడా స్పందిస్తామని, తమపై దురాక్రమణను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్క తమ దేశానికే కాదని, ప్రపంచ దేశాలకూ హానికరమని నొక్కిచెప్పారు. యుద్ధ సమయంలో ఇరాన్‌కు భారత్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్‌తోపాటు మరిన్ని దేశాలు ముందుకు రావాలని ఎస్‌సీఓ వేదికగా పిలుపునిచ్చారు. భారత్ చొరవ తీసుకుని మరిన్ని దేశాలను ఒప్పించాలని కోరారు.

భారత్ కిర్గిస్థాన్ బంధం బలోపేతం

భారత ప్రధాని మోదీ ఎస్‌సీఓ వేదికగా కిర్గిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, స్నేహ సంబంధాల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ అంతముందుకు బిష్షెక్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఘాట్‌కు వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం ప్రవాస భారతీయులు, విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, యోగా అభ్యాసకులు, సాంస్కృతిక ప్రతినిధులతో భేటీ అయి ఆప్యాయంగా ముచ్చటించారు. మోదీ వెంట భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ ఉన్నారు.

ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌తో భేటీ

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు భారత్ నుంచి అన్నిరకాల సహాయ సహకరా లు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చా రు. దౌత్యమార్గాల ద్వారానే పశ్చిమాసియాలో శాంతిస్థాపన సాధ్యమని నొక్కిచెప్పారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో అమెరికా -ఇరాన్ మధ్య యుద్ధం పారంభమైన తర్వాత ఇరాన్ ప్రభుత్వ పెద్దతో మోదీ భేటీ కావడం మొదటిసారి కావడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.

భేటీలో ప్రధానంగా యుద్ధం ముగింపు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించే అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సం దర్భంగా మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరాన్ శాయశక్తులా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్‌తో భారత్ నెరపుతున్న శతబ్దాల స్నేహ సంబంధాలను మరింత బలోపే తం చేయాలని ఆకాంక్షించారు.

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం సెప్టెంబర్ ౧౨, ౧౩వ తేదీల్లో భారత రాజధాని ఢిల్లీలో జరుగనున్న ‘బ్రిక్స్’ శిఖరా గ్ర సదస్సుకు పెజిష్కియాన్‌ను ఆహ్వానించారు. భేటీకి ఇరాన్ విదేశాంగ మంత్రి సెయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా ప్రాతినిధ్యం వహించారు.