ఎలక్ట్రికల్ సర్క్యూట్ తో భారీగా ఆస్తి దగ్ధం.
రాజాపూర్: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ముదిరాజ్ కమ్యూనిటీ భవనంలో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన భారీ ఆస్తి అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆజమాని పార్వతమ్మ ఇందిరమ్మ ఇల్లు రావడంతో పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం ను చేపడుతున్నారు.బుద్ధుల వెంకటమ్మ అనే వృద్దురాలు కుటుంబ కళాహలతో ముదిరాజ్ భవనంలో నివసిస్తున్నాయి. సోమవారం అందరూ పనులకు వెళ్లిన తర్వాత కమ్యూనిటీ భవనంలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. పక్క కుటుంబాలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అందులో సిలిండర్లు ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసులు భయాందోళన చెందారు. ఈ ప్రమాద ఘటనలో అజమోని పార్వతమ్మ కు రూ.6 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు గృహప్రకరణ సామాగ్రి బియ్యం మొత్తం పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు ఆస్తి మొత్తం విలువ రూ. 12 లక్షలకు పైగా అగ్నికి ఆహుతి కావడం కుటుంబ రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం పార్వతమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






