1 September, 2026 | 2:36 AM

శివారులోని గల్లీగల్లీలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం

01-09-2026 12:13 AM
  1. అభివృద్ధిలో కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
  2. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ముకరంపుర, ఆగస్టు 31 (విజయ క్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో గల్లీగల్లీలో నూ నూతనంగా రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోట లో 70 లక్షల యూఐడీఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్ లైన్, సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నందున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మోడల్ రోడ్లు, స్కై వాక్, జంక్షన్ల అభివ్రుద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, వాటర్ డ్రెయిన్స్ నిర్మాణం వంటి వాటితోతోపాటు అభివ్రుద్ధిలో కరీంనగర్ ను తెలు గు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం గత ఏడేళ్లలో 22 వేల కోట్లకుపైగా నిధులను ఖ ర్చు చేసినట్లు వివరించారు.

కరీంనగర్ కా ర్పొరేషన్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చేయాలని కసితో పనిచేస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా కేంద్రం నుండి 50 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తీసుకువచ్చామని, ఇవికాకుండా మరో 30 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. దీంతోపాటు కేంద్ర పెద్దల ను ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ను చేర్చించి 840 కోట్లు నిధులు తీసు కువచ్చామని, ఆయా నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలను మార్చబోతున్నామన్నారు.

630 కోట్లతో కరీంనగర్ లో 40 ఫీట్లు అంతకంటే ఎక్కువ మోడల్ రోడ్లను 50 కి.మీల మేరకు నిర్మించబోతున్నామన్నారు. దీంతోపాటు జిల్లా కోర్టు, సివిల్ ఆసుపత్రి, గీతాభవన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామన్నారు. కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్కై వాక్ (హైదరాబాద్ ఉప్పల్ తరహాలో) ను నిర్మిస్తామని, నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి వాటిని కూడా సుందరంగా అభివ్రుద్ధి చేస్తామన్నారు.

దీం తోపాటు 130 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేసి నగరంలో కాలుష్య రహిత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపు కుని కరీంనగర్ అభివ్రుద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకోసం ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిసనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.