సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి లక్ష్మీబాయి పేరు పెట్టాలి
- సముచిత గౌరవం కల్పించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
- మద్దతు తెలిపిన వీహెచ్,బీఆర్‌ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి
ముషీరాబాద్,ఆగస్టు 31(విజయక్రాంతి): సైదాబాద్‌లో కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి స్వాతంత్య్ర సమరయోధురాలు, తొలి మహి ళా పార్లమెంటేరియన్ సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (BC JAC Chairman Jajula Srinivas Goud) డిమాండ్ చేశారు.
గన్‌పార్క్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, స్టేడియా లు, రహదారులు, ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలకు అగ్రకుల నేతల పేర్లు పెడుతున్న ప్రభుత్వా లు, బీసీ వర్గాలకు చెందిన చారిత్రక వ్యక్తుల ను విస్మరిస్తున్నాయని విమర్శించారు. మ హిళలకు విద్య అందించడంతో పాటు, తన ఆస్తులను ట్రస్ట్గా మార్చి ఇందిరా సేవా సద న్ ద్వారా నిరక్షరాస్యులు, అభాగ్యులకు సేవలందించిన సంఘం లక్ష్మీబాయికి సముచిత గౌరవం కల్పించాలని కోరారు.
బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మద్దతు తెలిపారు.సంఘం లక్ష్మీబాయి పేరును స్టీల్ బ్రిడ్జి కి పెట్టడంతో పాటు ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సిరికొండ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు మాట్లాడుతూ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని తెలిపారు. హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో కలిసి సీఎంను త్వరలో కలసి ఈ అంశాన్ని వివరిస్తానని, సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కనకాల శ్యాం కుర్మా, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, వినయ్ కిషోర్ యాదవ్, రావుల కోల్ నరేష్ ప్రజాపతి, యోగి పాల్గొన్నారు.






