30 July, 2026 | 2:23 AM

తాండూరు గ్రామంలో జలసిరి మనసరిపై ప్రత్యేక గ్రామసభ

30-07-2026 01:43 AM

నాగిరెడ్డిపేట్, జులై 29 (విజయక్రాంతి): తాండూరు గ్రామంలో జలసిరి మనసిరి ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభనందు జల సంరక్షణ, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, బోర్ వెల్ రీఛార్జ్ గుంతలు, మ్యాజిక్ డ్రైన్స్, సోప్ ఫీట్లు మరియు నీటి సంరక్షణ పద్ధతుల గురించి, నీటి సంరక్షణ వల్ల ఉపయోగాలు, హార్టికల్చర్లో భాగంగా, జామ, మామిడి, మునగ పంటల సాగు లాభాలు గురించి చర్చించడం జరిగింది.

విబి-జి రంజి ఉన్న పనులు, వాటిని ఉపయోగించి గ్రామ అభివృద్ధి ఎలా చేసుకోవచ్చో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమ యాదగౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటి కిష్టయ్య, నియోజక వర్గం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏపీఓ సక్కుబాయి, ఏపిఎం దత్తు, కార్యదర్శి కార్తీక్, వార్డ్ సభ్యులు,రైతులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.