30 July, 2026 | 2:18 AM

అంగన్వాడీ.. భవిష్యత్తుకు బలమైన పునాది

30-07-2026 01:42 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

రాజాపూర్ జులై 29 : అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల విద్యా వికాసానికి పునాదుల వంటివని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెన్నవెళ్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి అంగన్వాడి కేంద్రాలు కీలకమైనవని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ప్రాథమిక విద్య,

ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చిన్నారికి నాణ్యమైన వసతులు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సౌకర్యాలతో అంగన్వాడి భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య, శేఖర్ రెడ్డి,రమేష్ రెడ్డి, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.