29 July, 2026 | 9:12 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

పాదయాత్ర చేసే హనుమాన్ స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించాలి

11-05-2026 05:32 PM

 సుద్దాల గురుస్వామి ముత్యాల శ్రీనివాస్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కొండగట్టు అంజన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే హనుమాన్ మాలధారుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన గురుస్వామి ముత్యాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలకు సుల్తానాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హనుమాన్ దీక్ష ధరించి, సుమారు వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన కొండగట్టుకు చేరుకుంటారని తెలిపారు.

ఎండల తీవ్రత దృష్ట్యా, కఠిన నియమాలతో పాదయాత్ర చేయడం వల్ల భక్తుల కాళ్లకు బొబ్బలు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వందల కిలోమీటర్లు నడిచి అలసిపోయిన స్వాములు, కొండగట్టు చేరుకున్నాక గంటల తరబడి సామాన్య క్యూ లైన్లలో నిలబడటం చాలా కష్టతరంగా మారిందని అన్నారు. కావున, కేవలం పాదయాత్ర ద్వారా వచ్చే భక్తుల కోసం "ప్రత్యేక దర్శన లైన్" ఏర్పాటు చేసి, వారి భక్తికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.