11 May, 2026 | 6:38 PM

లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు

11-05-2026 05:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు సోమవారం నిర్వహించారు. లాడ్జీలు, హోటళ్లలో బసకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు నమోదు చేయాలని, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తో పాటు, పట్టణ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, సిబ్బంది ఉన్నారు.