రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, నారపల్లి సమీపంలోని రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక రికగ్నిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైమెన్షన్స్ ఇన్ స్కూల్ (ఆర్ఐడిఎస్) అంతర్జాతీయ అవార్డును లీ- మెరిడియన్ హెూటల్ కనౌట్ ప్లేస్, న్యూ ఢిల్లీ లో అందజేశారు. అంతర్జాతీయ దృక్పథం, ప్రపంచ స్థాయి సహకారం, వినూత్న బోధన అభ్యాస విధానాలను ప్రోత్సహించినందుకు రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ఆర్ఐడిఎస్ అవార్డు రావడం గర్వకారణం అని తెలిపారు.
పాఠశాల తరపున ప్రధాన ఉపాధ్యారాలు కె. రూపా రెడ్డి కి ఆర్ఐడిఎస్ కోఆర్డినేటర్ ఐ. సుచిత్ర పద్మావతి ఈఅవార్డును అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి నిదర్శనం అన్నారు. విద్యా ప్రక్రియలో అంతర్జాతీయ అంశాలను సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల్లో ప్రపంచ అవగాహన, అంతర్జాతీయ దృక్పథాన్ని పెంపొందించడంలో పాఠశాల సాధించిన విజయానికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యారాలు కె. రూపా రెడ్డి, ఆర్ఐడిఎస్ కోఆర్డినేటర్ ఐ. సుచిత్ర పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు పాఠశాల విద్యా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచి, భవిష్యత్తులోనూ ప్రపంచ దృక్పథంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ఈ విశిష్ట విజయాన్ని సాధించిన రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.






