నారాయణఖేడ్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యటన
నారాయణఖేడ్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు గురువారం నారాయణఖేడ్ కు వచ్చారు. ఆయన స్థానికంగా ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు ఆయనకు గెస్ట్ హౌస్ లో పోలీసు గౌరవ వందనం చేశారు.
అనంతరం ఆయన ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఖేడ్ ప్రాంతానికి రావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, కౌన్సిలర్లు పండరి రెడ్డి, ముంతాజ్ సేట్, మాజీ ఎంపీటీసీలు నారాయణ జాదవ్, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






