పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రామ సర్పంచ్ ముక్కాముల వెంకన్న
కొనసాగుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక
చండూరు,(విజయక్రాంతి): పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పుల్లెంల సర్పంచ్ ముక్కాముల వెంకన్న అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పొడి చల్లిస్తున్నామని, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ఎంతో అవసరమని చెప్పారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచి గ్రామ పంచాయతీకి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రభు వర్ధన్,పుల్లెంల ఉప సర్పంచ్ ఉశయ్య, వార్డు సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.




