1 June, 2026 | 12:56 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్

01-06-2026 11:06 AM

ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్ తో కలిసి హాజరు అయ్యి విధి నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీఐపీ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పర్యటన ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ,  పోలీసు అధికారులు పాల్గొన్నారు.