calender_icon.png 15 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచికొట్టిన మార్క్ క్రమ్

15-02-2026 12:28:26 AM

సఫారీల చేతిలో కివీస్ చిత్తు

సౌతాఫ్రికా హ్యాట్రిక్ విజయం

అహ్మదాబాద్, ఫిబ్రవరి 14 : టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా హ్యాట్రిక్ విక్టరీ కొ ట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్లు కివీస్‌ను భారీస్కోరు చేయకుండా కట్టడి చేస్తే.. బ్యాటింగ్ లో మా్రక్రమ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఫలితం గా సౌతాఫ్రికా సూపర్-8కు మరింత చేరువైం ది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. దూకుడుగా  నే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటకీ కేవలం 64 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది.

సిఫర్ట్ 13, ఫిన్ అలెన్ 31, రచిన్ రవీంద్ర 13, గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగుకే వెనుదిరిగారు. ఈ దశలో చాప్ మన్, డారిల్ మిఛెల్ కివీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 74 పరుగు లు జోడించారు. చాప్ మన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48, మిఛెల్ 24 బం తుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32 పరుగులకు ఔటయ్యారు.  దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 175 పరుగులే చేయగలిగింది. చివర్లో నీషమ్ (23) ధాటిగా ఆడకుంటే ఆ స్కోరు కూడా వచ్చేది కాదు. సఫారీ బౌలర్లలో మా ర్కో యెన్సన్ 4 వికెట్లు పడగొట్టా డు.

ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్లు దుమ్మురేపారు. క్వింటన్ డికాక్, కెప్టెన్ మార్క్ రమ్ చెలరేగిపోయారు. తొలి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మార్క్ రమ్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డికాక్(20), రికెల్టన్(21), బ్రెవిస్ (21) పరుగులకే ఔటయ్యారు. చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించిన కెప్టెన్ మార్క్ రమ్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా 17.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ విజయంతోసూపర్ 8 బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.