calender_icon.png 15 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కాట్లాండ్‌పై తడబడి గెలిచిన ఇంగ్లాండ్

15-02-2026 12:29:36 AM

కోల్‌కత్తా, ఫిబ్రవరి 14 : టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ రెండో విజయాన్ని అందు కుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇం గ్లీష్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాస్త తడబడినా తర్వాత పుంజుకుని గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కా ట్లాం డ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.

స్కాట్లాండ్ బ్యాటర్లలో బెరింగ్టన్(49), మైకేల్ జోన్స్ (33) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3,లియామ్ డాసన్, ఆర్చర్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్, ఓవర్టన్ తలో వికెట్ తీశారు. 153 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది.

కేవలం 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్(2), బట్లర్(3) నిరాశపరిచారు. ఈ దశలో జాకబ్ బెథల్, టామ్ బాంటన్ కీలక పార్టనర్‌షిప్‌తో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. బెథల్ 32 రన్స్‌కు వెనుదిరిగినా, బాంటర్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు.చివర్లో సామ్ కరన్, విల్ జాక్స్ దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయం తో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.