calender_icon.png 15 February, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐర్లాండ్ దెబ్బకు ఒమన్ ఔట్

15-02-2026 12:26:41 AM

కొలంబో, ఫిబ్రవరి 14 : టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన ఆ జట్టు మూడో మ్యాచ్‌లో దుమ్మురేపింది. ఒమన్‌పై 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 235 పరుగుల భారీస్కోరు చేసింది. తరువాత ఒమన్ 18 ఓవర్ల లో 139 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ 3 వికెట్లతో ఒమన్ బ్యాటింగ్‌ను దెబ్బకొట్టాడు. మాథ్యూ హంప్రిస్, మెకార్తీ రెండేసి వికెట్లతో రాణించారు. టోర్నీలో ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం.