5 May, 2026 | 4:59 PM

నీటి సమస్యకు పరిష్కారం..

05-05-2026 03:46 PM

నూతన పాలకవర్గానికి గ్రామస్తుల అభినందనలు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని మొదటి వార్డులో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు నూతన పాలకవర్గం పరిష్కారం చూపింది. వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో కొత్త బోరు వేయించడం జరిగింది. దీంతో దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న వార్డ్ ప్రజలు ఉపశమనం పొందారు. నీటి సమస్యను పరిష్కరించిన నూతన పాలకవర్గానికి, గ్రామ కార్యదర్శి విజయ్‌కు వార్డ్ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.