5 May, 2026 | 5:04 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు

05-05-2026 03:49 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో తూకంలో మరియు హమాలీ కూలీలలో వ్యత్యాసం జరుగుతుందని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలుక పెంటయ్య అన్నారు.   మండలం లోని అన్ని గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలలో తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇట్టి విషయాన్ని పలుమార్లు  ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఐకేపీ ఏపీఎం కల్పన దృష్టికి తీసుకువెళ్లిన వారి నుండి ఎలాంటి ఫలితం లేకపోవడంతో తమ దృష్టికి తీసుకొని వచ్చామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై  మండల ఎమ్మార్వో భూపతి కి వినతి పత్రం అందజేసి రైతులకు, హమాలీలకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు మర్రి రాజు,మహేష్, హరిబాబు. రవీందర్ రెడ్డి. రామస్వామి , శ్రీను, రాజేశం పాల్గొన్నారు.