29 August, 2026 | 5:52 AM

87 వేల స్మార్ట్ కార్డులు పంపిణీ

29-08-2026 12:13 AM

జుక్కల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు  శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో అర్హులైన వారికి సుమారు 87 వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించామన్నారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సాయ గౌడ్, సతీష్ పటేల్, తహశీల్దార్ మారుతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.