29 August, 2026 | 2:36 AM

ఎంజీఎంలో రోగులకి సౌకర్యాలు మెరుగుపరచాలి

29-08-2026 12:12 AM

వరంగల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య వర ప్రధాయనిగా నిలుస్తున్న ఎంజీఎం హాస్పిటల్ లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఎంజిఎం హాస్పిటల్ లో రోగులకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వివిధ వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తూ హాస్పిటల్ లో రోగులకు మెరుగైన పూర్తిస్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల వార్డుతో సహా ఏ వార్డు లోను  పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందక రోగులు అవస్థలు పడుతున్న విషయాన్ని లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో రోగులకు అవసరమైన స్టెచ్చర్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచక పోవడం అట్లా ఆవేదన వ్యక్తం చేశారు . ఎంజీఎం హాస్పిటల్ లో రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని గతంలో అనేకసార్లు ఉద్యమాలు చేపట్టినా పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద ఇటీవల హాస్పిటల్ ని సందర్శించినా పరిస్థితిలో మార్పు రాలేదు అలాగే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాస్పిటల్ ని సందర్శించి రోగుల సమస్యలను తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.