calender_icon.png 11 February, 2026 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు కోసం స్థల పరిశీలన

11-02-2026 12:39:13 AM

కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 10 :తెలంగాణఏపీ రా ష్ట్రాలను కలుపుతూ నాగర్ క ర్నూలు జిల్లా కొల్లాపూర్ ని యోజకవర్గంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై నిర్మించను న్న ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ వంతెన నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం పరిశీలించారు.

వంతెన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూ సంబంధిత అంశాలపై రెవెన్యూ, అటవీ, జాతీయ రహదారి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1077 మీటర్ల పొడవున ఈ వంతెనను ఈపీసీ విధానంలో నిర్మించనున్నారు.

వంతెన అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.ఈ వంతెన ఇరు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యంతో పాటు పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.