11 April, 2026 | 3:30 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

పురపీఠం దక్కేదెవరికో?

11-02-2026 12:37 AM
  1. ఓటమికి చేరువలో చైర్ పర్సన్ అభ్యర్తి 

కాంగ్రెస్ పార్టీ లో కట్టప్పలు ఎందరో 

ప్రచారంలో అదుపు తప్పి మాట్లాడిన మాజీ నేత 

వార్డుల్లో సైతం బలహీన మైన అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ 

నారాయణపేట జిల్లాలో కేంద్రంలోని పురపాలిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది కాంగ్రెస్, బిజెపి, బారాస, పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి

నారాయణపేట. ఫిబ్రవరి, 10(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని నేడు జరుగబోయే పురపోరులో త్రిముఖ పోటీ నెలకొంది ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, బారాస ,పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి . ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడిపోతారు 13 వ తేదీ రోజు బయట పడుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో వార్డుల్లో సైతం అనుచర గణం,గట్టి పట్టున్న బిజెపి పార్టీనాయకులు ఈసారి ఎలాగైనా ఛైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు తలో దిక్కుగా చెల్లా చెదురు అయినట్లుగా పార్టీలోని కొందరు నేతలు సైతం బాహుబలి సినిమాను తలపిస్తున్నట్లు కట్టప్పలుగా మారి వారికి వారే వెన్నుపోటు పొడవటానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో భాగంగానే ఓ వార్డులో సైతం కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత అదుపు తప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్న బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని బాహాటంగా బహిరంగ సభలో అన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

దీంట్లో భాగంగానే ఈ సారి ఏకంగా బారాస పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి స్థానికంగా మకాం వేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు . ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నాయకులు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో మొత్తం 24 వార్డులకు కు గాను బీజేపీ కి 8నుండి 10 వార్డులు, కాంగ్రెస్ కు 6నుండి 7 వార్డులు , బారాస కు 4 వార్డులు, ఏఐఎంఐఎం కు 1వార్డు స్వతంత్రులు 2 వార్డులు గెలుచుకొని చైర్ పర్సన్ పీఠాన్ని బిజెపి, వైస్ చైర్మన్ పీఠాన్ని బారాస పార్టీలు దక్కించుకుంటాయని పట్టణ ప్రజలు మేధావులు చర్చించుకుంటున్నారు.