calender_icon.png 11 February, 2026 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు

11-02-2026 12:39:35 AM

పోలీసు కమిషనర్ సాయి చైతన్య

భీంగల్ పట్టణంలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం పర్యవేక్షణ

భీంగల్, ఫిబ్రవరి 1౦ (విజయక్రాంతి): నేడు జరగనున్న భీంగల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ  సందర్భంగా  భీంగల్ లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను నిజామాబాద్ సిపి సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత భీంగల్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటు వంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్  వద్ద  పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందికి సూచించారు.

విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలింగ్ బూతులను పర్యవేక్షించారు ఈ పోలింగ్ బూతుల వద్ద ప్రజలు ఎవరు కూడా గుమిగూడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు.

సిపితోపాటు భీంగళ్ పర్యటనలో ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, సి.టి.సి ఎ.సి.పి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, భీంగల్  సి.ఐ పొన్నం సత్యనారాయణ,  భీంగల్ ఎస్త్స్ర తిరుపతి,  కమ్మర్పల్లి ఎస్త్స్ర అనిల్,  మోర్తాడ్ ఎస్త్స్ర రాము,  ఏర్గట్ల ఎస్త్స్ర రాజేశ్వర్, ఎం.పీ.డీ.వో గంగుల సంతోష్ కుమార్, ఎం.ఆర్.ఓ ఎం.డి షబీర్, ఎన్నికల పరిశీలకులు తదితరులు ఉన్నారు.