16 July, 2026 | 6:19 PM

బోధన్ ఆర్టీసీ కార్గోలో మిగిలిన వస్తువుల వేలం

16-07-2026 05:57 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో పార్సల్ సర్వీసులో మిగిలి ఉన్న పాత వస్తువుల వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. బోధన్ బస్టాండ్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలం పాటలో పాల్గొనదలచిన ఆసక్తి గల ప్రజలు నిర్ణీత సమయంలో హాజరై తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు.