10 July, 2026 | 3:07 AM

‘సర్’ హెల్ప్‌డెస్క్ ప్రారంభం

10-07-2026 12:29 AM

ఘట్ కేసర్, జూలై 9 (విజయక్రాంతి): ఎంఎంసి సర్ లో భాగంగా ఘట్ కేసర్ 6వ డివిజన్ బాలాజీ నగర్ లోని బస్తి దవాఖాన వద్ద ఓటర్ ఎన్ మోరేషన్ పత్రాలను ఎలా నింపాలి అనే దానిపై మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ హెల్ప్ డిస్క్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ గురించి అవగాహన తెలుపుతూ ఓటు హక్కు అర్హులైన ప్రతి పౌరునికి ఎంతో ముఖ్యమన్నారు. 

హెల్ప్ డిస్క్ లో ఓటర్లు జాబితాను వాళ్ల వాళ్ల బూతుల వారిగా ఎక్కడ ఉన్నాయో వారికి తెలప డం జరిగిందని, అదేవిధంగా ఫామ్ ను ఎలా నింపాలో ఎవరికైతే ఫామ్స్ నింపడం రాదో వారికి ఫామ్ నింపి ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసి సర్కిల్ మేనేజర్, బిఎల్‌ఓ అధికారులు  మాజీ వార్డ్ మెంబర్ వి.బి. వెంకటనారాయణ, బిఎల్‌ఏ షేక్ వాజిద్, అ ష్రాఫ్ అలీ, రఫీద్దీన్, ఫహీం, సాయి, అభిలాష్, ఓటర్లు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.