10 July, 2026 | 3:11 AM

స్కూల్‌లో అల్పాహారం తనిఖీ చేసిన కలెక్టర్

10-07-2026 12:30 AM

మేడ్చల్, జిల్లా 9(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా అల్వాల్ సమీపంలో ని కౌకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహారాన్ని కలెక్టర్ మను చౌదరి తనిఖీ చేశారు. అల్పాహారం ఏమిస్తున్నారు, ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నాణ్యమైన అల్పాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు ఎలా ఉన్నాయని హెడ్మాస్టర్ మురళి కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు.

అదనపు గదులు అవసరమని కలెక్టర్ కు తెలిపారు. అదనపు గదులు మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించారు. స్పోరట్స్ సామాగ్రి ఇవ్వాలని విద్యార్థులు కోరగా, త్వరలో అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రేణుకాదేవి, తహసిల్దార్ రాములు పాల్గొన్నారు.