3 March, 2026 | 3:54 PM

జనరల్ మేనేజర్ చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న సింగరేణి ఉద్యోగులు

03-03-2026 01:21 PM

జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న సత్తుపల్లి సింగరేణి ఉద్యోగులు.

సత్తుపల్లి,(విజయక్రాంతి): జేవిఆర్ఓసి  ఉద్యోగులకు కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా జేవిఆర్ఓసీలో 16 మంది ఉద్యోగులకు (హెడ్ ఓవర్ మన్ గ్రేడ్-A నుంచి గ్రేడ్-A1 పొందిన వారు 5 మందికి ,  ఓవర్ మన్ గ్రేడ్-B నుంచి హెడ్ ఓవర్ మన్ గ్రేడ్-A పొందిన వారు 7 మందికి అంతేకాకుండా  టైం రేటెడ్ వేకెన్సీలను  ద్వారా ఐదు గురు పదోన్నతి పొందినారు. కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా కిష్టారం ఓసీ లో ఒకరికి వెల్డర్ కేటగిరీ - IV నుంచి కేటగిరీ-V  మరియు  జె ఆర్ జె వి ఆర్ సి హెచ్ పి లో మెకానికల్ (ఫారెమన్ )  గ్రేడ్ -B నుంచి A ఒకరికి పదోన్నతులను కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి ఏరియా జిఎం శ్రీ చింతల శ్రీనివాస్  చేతుల మీద ప్రమోషన్ ఆర్డర్స్  ఇవ్వడం జరిగింది .

. ఈ కార్యక్రమంలో జేవిఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎన్విఆర్ ప్రహ్లాద్   జై వి ఆర్ ఓ సి, ప్రాజెక్ట్ ఇంజనీర్, శ్రీ,డి శ్రీనివాసరావు    జె వి ఆర్, ఎస్ ఓ ఎం శ్రీ బి రాజేశ్వరరావు , ఓ సి ఎం జి. కళ్యాణ్ రామ్  ఏ ఐ టి యూ సి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సుధాకర్ గారు, ఐ ఎన్ టి సి, వైస్ ప్రెసిడెంట్, శ్రీ బి   ,ఏ ఐ టి యూ సి పిట్ సెక్రటరీ శ్రీ గ్ నరసింహారావు , వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ కె శ్రీనివాస్ పాల్గొన్నారు.