ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తా
- దసరాలోపు పనులు ప్రారంభించాల్సిందే
- లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ సాధన సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
షాద్‌నగర్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధన కోసం శుక్రవా రం రాత్రి నిర్వహించిన ‘టీఆర్‌ఎస్ శంఖారావం’ బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు.
ప్రభుత్వానికి దసరా వరకు సమయం ఇస్తున్నామని, అప్పటిలోపు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే ప్రాజెక్ట్ పరివాహాక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో 33 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు కానీ, 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.






