మంత్రి కొమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణుల దాడి
- సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడులు
నల్లగొండ టౌన్, ఆగస్టు 31(విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో సోమవారం కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య దాడి, ప్రతిదాడులు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు తెరలే పాయి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రతి దాడికి యత్నించాయి.- పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ పార్టీ రాష్ట్ర కా ర్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాల యం ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశా రు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీకి నిప్పటించారు.
కార్యాలయం పై టమాటాలు, గుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై కాంగ్రె స్ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు మండిపడ్డారు.మరోసారి తమ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై దా డులకు ప్రయత్నిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా పెద్దఎత్తున ఆందోళ నలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు.
బీజేపీ దాడి అనంతరం పోలీసులు క్యాంప్ కార్యాలయానికి చే రుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం, కోమటిరెడ్డి ఫ్లెక్సీకి నిప్పంటించడంతో ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తన ఆనుచరులు, పార్టీ శ్రేణులతో మం త్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రతి దాడి చేసేందుకు కార్యకర్తలతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
కొం దరు కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించివేసి కార్యాలయం పై దాడి చేశారు. దీంతో నల్లగొండలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా తయారైంది. బీజేపీ కార్యాలయం వద్దకు భారీ ఎత్తున పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ క్యాంపు కార్యాలయాల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






