బీఆర్‌ఎస్ ఫెయిల్
10 ఏండ్ల కేసీఆర్ పాలన, మా 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?
వెయ్యి రోజుల్లో కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసింది
- ప్రతిపక్ష హోదాలో ఒక్కరోజైనా పనిచేశారా?
- ప్రజలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
- అభివృద్ధి, సంక్షేమమే మా ప్రజాపాలనకు నిదర్శనం
- మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
ముషీరాబాద్,ఆగస్టు 31(విజయక్రాంతి): పాలనలో బీఆర్‌ఎస్ ఫెయిల్(BRS failure) అయ్యిందని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) 1000 రోజులుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. 1000 రోజుల్లో పేదలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల కోసం కేసీఆర్(KCR) ఒక్క రోజైనా పనిచేశారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ భద్రత, వసతుల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు(Assembly meetings) కేసీఆర్ హాజరై తెలంగాణకు న్యాయం చేయాలనే నమ్మకం ఉంటే తనతో చర్చకు రావాలని సీఎం సవాల్ విసిరారు. పదేళ్ల కేసీఆర్ పాలన, తమ 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తెలంగాణ(Telangana)లో ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిందని విమర్శించిన సీఎం, కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మూసారాంబాగ్‌లో రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన 400 మీటర్ల పొడవైన హైలెవల్ బ్రిడ్జిని సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు మూసారాంబాగ్‌లో ఎందుకు బ్రిడ్జి కట్టలేదు..? ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. పదేళ్లలో అంబర్‌పేటలో ఇళ్లు కట్టించి ఇచ్చారా..? పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తే ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చేది. కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను దళారులకు ఇచ్చారు.
పేదలకు కాదని సీఎం స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటను చెరబట్టింది ఎవరు? ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్‌లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరబట్టింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించామని, హైడ్రాను తెచ్చానని తనపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ప్రజాపాలనకు 1000 రోజులు
పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 1000 రోజులు పూర్తి చేసుకున్నామన్నారు. అయితే ‘1000 రోజుల ప్రజాపాలనపై మేం కార్యాచరణ తీసుకున్నాం. నిరసన తెలుపుతాం’ అని కొందరు బయలుదేరారు. పదేళ్లు తెలంగాణను నడిపించిన వాళ్లు, కబళించిన వాళ్లు ఇప్పుడు నిరసనలు తెలుపుతామంటున్నారు.
2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకా రం చేసి సెక్రటేరియట్‌కు వెళ్లి సమీక్ష చేస్తే 11 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని చెప్పారు. 16 వేల కోట్ల మిగులు తో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు తెలంగాణను అప్పగించిందని రేవంత్ చెప్పారు. ఏడాదికి 6,500 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తే సరిపోయేది. కానీ తొమ్మిదిన్నర ఏళ్లలో ఒకే ఒక కుటుం బం 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో తెలంగాణను నిండా ముంచిందని విమర్శించారు.
జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చిందన్నారు. 60 ఏళ్లలో 16 మంది ముఖ్య మంత్రులు 70 వేల కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ఒక్కడే తొమ్మిదిన్నర ఏళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేశాడని ఆరోపించారు. దీంతో నెలకు 7,500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సి వస్తోందని, ఏడాదికి 85 వేల కోట్ల అ సలు, మిత్తి చెల్లించే పరిస్థితుల్లోకి నెట్టారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ ఏనాడైనా ఆలోచించాడా..?
7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇం దిరమ్మ ఇళ్లు కడుతున్నామని ప్రజా పాలన అంటే ఇది కదా అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 1000 ఎకరాల్లో కేసీఆర్, 100 ఎకరాల్లో కేటీఆర్, జన్వాడలో 50 ఎకరాల్లో కవిత ఫామ్‌హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. పేదల ఆత్మగౌరవం అయిన రేషన్ కార్డు ఇవ్వాలని ఏనాడైనా ఆలోచించారా..? అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి వరదల్లో మునిగిపోతే 2,000 కోట్లు పెట్టి కొత్త ఆస్ప త్రి కట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదు? మా ప్రభుత్వం 2,000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తోందని తెలిపారు.
కేసీఆర్ ఒక్కరోజైనా పనిచేశావా?
1000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కేసీఆర్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధు లకు రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి కేసీఆర్‌ను ఏం చేయాలి? ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ భద్రత, వసతుల కోసం రూ.21 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 1000 రోజుల్లో పేదలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల కోసం ఒక్క రోజైనా పనిచేశావా? మనమడు ఆస్పత్రికి వెళ్తే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప బ యటకు రాలేదని విమర్శించారు. ‘నేను 1000 రోజుల్లో ఒక్క గంటైనా సెలవు తీసుకోలేదని, నీవు 1000 రోజుల్లో ఒక్కరోజైనా పనిచేశావా? నీకు, నాకు పోలికనా? నందికి, పందికి ఉన్న తేడా ఉంది’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
గంట కూడా పనిచేయలే.. రాజీనామా చేయ్..
1000 రోజులు ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని పార్టీశ్రేణులకు సీఎం రేవం త్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. పందికొక్కుల్లా తిని ఫామ్‌హౌస్ నుంచి బయటకు రారా..? దే శంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు 1000 రోజులు బయటకు రాకుండా ఉన్నారా..? ‘నీ వైఖరి వల్ల ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందినదిగా రాష్ట్రం తెలంగాణ ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం పెట్టి కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న దుర్మార్గులు.. అగ్గిపెట్టె రావుకు ఆనాడు పది పైసల అగ్గిపెట్టె దొరకలేదని విమర్శించారు.
నేటి నుంచి కాంగ్రెస్ నిరసనలు
ఇరవై రెండు కోట్ల నాలుగు లక్షల నలభై వేల జీతం తీసుకున్న ప్రతిపక్ష నాయకుడు వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు తెలపాలని, 6న ఇందిరా పార్క్‌లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ల ఎదురుగానే అన్ని విషయాలు చెప్తానని రే వంత్ స్పష్టం చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ‘పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో, 1000 రోజుల్లో నేను ఏం చేశానో అసెంబ్లీలో చర్చ కు సిద్ధం.
తాను ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదు. చేయను కూడా. తెలం గాణ ఉద్యమంలో ‘నేను, నా ముసల్ది’ అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కు టుంబాన్ని దించారని విమర్శించారు. గుం పు మందలా జమై మంది సొమ్ము తిన్నారని, మంగళవారం నుంచి ఆరు రోజుల పా టు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.
బీఆర్‌ఎస్ వాళ్లు సన్నబియ్యం తింటూ విమర్శలు
8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు కేసీఆర్ పెట్టిపోయారని రేవంత్ విమ ర్శించారు. కాంగ్రెస్ పాలనలో రెండు నెలల్లో 6 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేశామన్నారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 60 మంది చనిపోతే కనీసం కన్నీరు కార్చలేదు. ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావు బయటకు రాలేదని ఆరోపించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
28వ స్థానంలో ఉన్న తెలంగాణను 18వ స్థానానికి తీసుకువచ్చామని అన్నారు. 10 ఏళ్ల పాలనలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇవ్వాలి, ప్రశ్నాపత్రాలు ముద్రించి లీక్ చేయాలి. ఇదే గత ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. 1000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు.
‘మీ బతుకు లు బతుకమ్మ చీరల్లో ఉన్నాయి.. మా గొప్ప లు ఇందిరమ్మ చీరల్లో ఉన్నాయి. మీ బతుకులు చెడా.. నిరసన కార్యక్రమాలు చేస్తా రా..? మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని, ఇందులో బీఆర్‌ఎస్ వాళ్లు కూడా ఉన్నారని, సన్నబియ్యం తింటూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
భారీ వరదలను తట్టుకునేలా నిర్మాణం
మూసీలో లక్షా 50 వేల క్యూసెక్కుల వర ద నీరు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా మూసారంబాగ్ బ్రిడ్జిని నిర్మించినట్లు సీఎం తెలిపారు. నగరంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం పేదలు, మహిళ లు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇప్పటివరకు 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం చేపట్టామని, హైదరాబాద్‌లో పేదల కో సం లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.3, 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
కొత్త ఆస్పత్రుల నిర్మాణం
ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రా రంభించనున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. అల్వాల్ టి మ్స్‌కు మాజీ సీఎం అంజయ్య, ఎల్బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు. మా పాలనలో బీసీ, బడుగు వర్గాల నేతలకు గౌరవం దక్కిందన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిబా ఫూలే వంటి మహనీయుల విగ్రహాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు సీఎం గుర్తుచేశారు. వీరనారి చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం తో పాటు ఆమె మనవరాలికి మహిళా కమిషన్‌లో అవకాశం కల్పించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశామన్నారు.
తమ ప్రభుత్వం 1000 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిందని రేవంత్‌రె డ్డి తెలిపారు. తెలంగాణలో బీసీ కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని అ న్నారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పాలసీతో పాటు స్పోరట్స్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ రంగాలకు కొత్త విధానాలను తీసుకొచ్చామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారు వీ హనుమంత రావు, ఎం పీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, శ్రీగణే ష్, నవీన్ యాదవ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, మా జీ ఎంపీ మధు యాష్కీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.






