1 September, 2026 | 3:12 AM

ఆర్‌ఎస్‌ఎస్ హెడ్డాఫీస్ ముట్టడి

01-09-2026 02:20 AM
  1. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతల నిరసన
  2. ఖర్గేకు అవమానంపై కన్నెర్ర

న్యూఢిల్లీ, ఆగస్టు ౩౧: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానానికి బాధ్యత వహిస్తూ కేం ద్ర హోమంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ జాతీయ విభాగ నేతలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది.

ఖర్గే పర్యటన ప్రాంతంలో కొందరు శుద్ధీకరణ చేపట్టారని, ఆ శుద్ధీకరణ కులోన్మాదానికి పరాకాష్ట అంటూ యూత్ కాంగ్రెస్ నేతలు దేశ రాజధానిలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చా రు.

శుద్ధీకరణకు పూనుకున్న బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. యూత్ కాంగ్రెస్ జా తీయ అధ్యక్షుడు ఉదయ్‌భానుచిబ్ నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. నిరసనకారులు రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని నినాదించారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఎదుట మనుస్మృతి పుస్తక ప్రతులను దహనం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం పూర్తిగా దళితులకు వ్యతిరేకమని ఆరోపించారు.ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు రంగంలోకి దిగి ఉదయ్ భానుచిబ్‌తో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.