అల్ఫోర్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభం
01-09-2026 01:50 AM
ముకరంపుర, ఆగస్టు 31 (విజయ క్రాం తి): నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ క్యా ంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఘన ంగా ప్రారంభించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వలన మానవాళికి ఎన్నో లా భాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని, వి జయాలను సొంతం చేసుకోవాలని చెప్పా రు.
మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సాఫ్ట్‌వేర్ ప్రతినిధులు, సిబ్బంది, వి ద్యార్థులు పాల్గొన్నారు.






