రచ్చ.. రచ్చ
హండ్రెడ్ లీగ్ వేలంలో పాక్ ప్లేయర్‌ను తీసుకున్న సన్ రైజర్స్
కావ్యా మారన్‌పై తీవ్ర విమర్శలు
ఎక్స్ ఖాతా సస్పెండ్
ముంబై, మార్చి 13: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ వివాదంలో చిక్కుకున్నారు. హండ్రెడ్ లీగ్ వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ కోసం ఆమె పాక్ ప్లేయర్‌ను తీసుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోని సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొం తం చేసుకుంది.
ఇక ఇంగ్లాండ్‌లో ది హండ్రె డ్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఇందులో సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశమైంది. హండ్రెడ్ లీగ్ వేలం లో స్వయంగా పాల్గొన్న కావ్యా మారన్.. అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడ్డారు. ఏకంగా రూ.2.34 కోట్లకు కొనుగోలుచేశారు. అబ్రా ర్ కోసం మరో ఫ్రాంచైజీ ట్రెంట్ రాకెట్స్ పోటీపడింది.
అయితే అబ్రార్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ.. సన్ రైజ ర్స్ తీసుకోవడం పట్ల భార త అభిమానులు విమర్శ లు గుప్పిస్తున్నారు. ము ఖ్యంగా కావ్యా మారన్ తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ వేలంలో హారిస్ రవూఫ్, షా దాబ్ ఖాన్ వంటి అగ్రశ్రేణి పాక్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారిని కొనడానికి ఏ భారతీయ యజమాని సాహసించలే దు. కానీ కావ్య మారన్ మాత్రం ధైర్యంగా అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి, ఈ సీజన్‌లో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీ యజమానిగా నిలిచారు.
అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే సోషల్ మీడియా లో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఆటగాడిని ఎలా కొంటా రంటూ నెటిజన్లు తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలు ఎం తలా పెరిగాయంటే.. అబ్రార్‌ను కొన్న కొద్ది గంట ల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాను సంస్థ నిలిపివేసింది. భారీగా వస్తు న్న ట్రోలింగ్, దుర్భాషల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లం ఘించినందువల్ల ఖాతా ను నిలిపివేస్తున్నట్టు ‘ఎక్స్’ పాప ప్ మెసేజ్‌ను చూపించింది.
గత ఏడాది నార్తర్న్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీని రూ.1,100 కోట్లకు పైగా వెచ్చించి కావ్య మా రన్ దక్కించుకున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు ఈ లీగ్ జరగనుంది. ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యా చ్‌లలో అబ్రార్ అహ్మద్ ఓవరాక్షన్ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్‌ను ఔట్ చేసి అతి చేశాడు. డగౌట్ వైపు దారి చూపిస్తూ రెచ్చగొట్టాడు. ఇలాంటి వ్యక్తి ని కావ్యా మారన్ తన జట్టులోకి తీసుకోవడం భారత ఫ్యాన్సుకు మింగు డుపడటం లేదు. నిజానికి పాకిస్థాన్ ప్లేయ ర్స్ ఎవరినీ కూడా ఐపీఎల్లోకి తీసుకోరు. అ యితే ఈ రూల్ హండ్రెడ్ లీగ్స్‌కు మాత్రం వర్తించదు. అందుకే కావ్యా మారన్.. అబ్రా ర్న్ జట్టులోకి తీసుకున్నారు. దీంతో ప్రపంచ టీ20 లీగ్‌లలో పాక్ ప్లేయర్లను భారత ఫ్రాం చైజీలు తీసుకోబోవనే వాదనకు తెరదించారు.
అయితే ఫ్యాన్స్ మాత్రం పాక్‌తో మనం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనప్పుడు ఆ దేశ ప్లేయర్‌ను ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తు న్నారు. మరోవైపు ఈ అంశంపై బీసీసీఐ కూడా స్పందించింది. ఇది విదేశీ లీగ్‌కు సం బంధించిన అంశమని, బీసీసీఐ దీనిలో జో క్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. కాగా అబ్రార్ అహ్మద్ పాకిస్థాన్ తరఫున 46 టె స్టులు, 28 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 లోనూ ఆడాడు. అతడికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్స్‌తోపాటు మేజర్ లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.
యూరప్‌లో టీ20 లీగ్‌లో ఆడటం అబ్రార్‌కు ఇదే మొదటిసారి. అతని బౌలింగ్ వేరియేషన్ నచ్చి కొనుగోలు చేసినట్టు సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వేటోరీ చెప్పాడు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ సరిగ్గా మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుం ది. ఈ తరుణంలో కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం, ఐపీఎల్‌లో సన్ రైజర్స్ పాపులారిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుం దోనని అంతా ఎదురుచూస్తున్నారు.




