14 May, 2026 | 2:03 AM

సికింద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాల సీజ్

14-05-2026 01:10 AM

అనధికార నిర్మాణాలను సహించేది లేదు: జీహెచ్‌ఎంసి అధికారులు

సికింద్రాబాద్, మే 13 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మెట్టు గూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీతాఫల్‌మండిలో అనుమతులకు విరుద్ధంగా అనధికార భవనాలతో పాటు లాలాపేట్‌లోని నా లా పక్కన జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా పాత భవనంపై నూతనంగా మూడు అంతస్థుల అక్రమ నిర్మాణాన్ని అధికారులు సేజ్ చేశారు.

గత నెలలో ఈ అక్రమ నిర్మాణంపై పలు దినపత్రికలో ‘టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిలో అందరికీ వాటా’ అనే వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు వార్త కథనాలకి స్పందించిన జీహెచ్‌ఎంసీ మెట్టుగూడ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికా రులు చర్యలు తీసుకున్నారు.

డిప్యూ టీ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం సీతాఫల్‌మండి, లాలాపేట్ ప్రాంతాల్లో  వీరమాచినేని పాఠశాల వద్ద అ నుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని గుర్తించి సీజ్ చేశారు. అనధికార నిర్మాణాల ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీ లు కొనసాగుతాయని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెం ట్ సిటీ ప్లానర్ సాయిబాబా, టీపీబీఓ సత్యవర్ధన్ సాగర్‌తోపాటు టౌన్ ప్లానింగ్ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.