17 July, 2026 | 2:25 AM

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుడ్డి వెంకనీ ప్రభాకర్

17-07-2026 02:13 AM

నాగిరెడ్డిపేట్, జులై 16 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడ్డి వెంకనీ ప్రభాకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుమతులతో జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేసినట్లు గుడ్డి వెంకనీ ప్రభాకర్ తెలిపారు.

నియోజకవర్గం అధ్యక్షులుగా నియమితులైన గుడ్డి వెంకని ప్రభాకర్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో అవకాశం కల్పించినందుకు పార్టీకి మరింత కష్టపడి పని చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు, మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్కు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఉన్నత పదవులు దక్కుతాయనీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడపగడపకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కష్టపడే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని మంచి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్లోని ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గ్యార సాయిలు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య,మండల ఉపాధ్యక్షులు క్రిస్టఫర్, దేవయ్య నాయకులు పాల్గొన్నారు.