07-02-2026 07:49:52 PM
- సీపీ ఎస్.రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతి భద్రతల మధ్య జరిగేందుకు ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 7 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ ఆంక్షలు ముఖ్యంగా చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, కర్రలు, లాఠీలు, రాళ్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇతర ఆయుధాలను కలిగి ఉండటం నిషేధమన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది, అంత్యక్రియల ఊరేగింపులకు ఈ ఆంక్షలలో మినహాయింపు ఉంటుందని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.