18 May, 2026 | 2:48 AM

ఎకరా కనీస ధర 139 కోట్లు

18-05-2026 01:45 AM

రాయదుర్గంలో అమ్మకానికి ప్రభుత్వ భూములు

  1. ౧౧.38 ఎకరాలకు టీజీఐఐసీ ఈ వేలంనోటిఫికేషన్
  2. 26న ప్రక్రియ సంక్షేమ పథకాలకుతోడు అభివృద్ధి పనుల భారం
  3. ఎన్నికల హామీల అమలుకూ ఆర్థిక సమస్యలు.. 
  4. నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి
  5. భూవిక్రయ నిర్ణయంపై ప్రతిపక్షాల మండిపాటు
  6. తాత్కాలిక అవసరాల కోసం భూవిక్రయం ఎందుకని నిలదీత

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భుజానికెత్తుకున్న అభివృద్ధి పనులు.. ఇవన్నీ కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు.. వెరసి రాష్ట్రప్రభుత్వంపై నిధుల సమీకరణభారం. నెలనెలా రాష్ట్రానికి వచ్చే రాబ డికి, వ్యయాలకు పొంతలేని పరిస్థితి వచ్చిం ది. ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది.

ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సర్కార్ ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. దీనిలో భాగంగానే రాయదుర్గంలోని ప్రభుత్వ భూ ములను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆ భూముల ఈ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ అనుమతులతో భారీ ఎత్తున రుణాలను సమీకరిస్తూనే, మరోవైపు అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం రాజకీయంగా దుమారం రేపింది.

రాష్ట్రానికి శాశ్వత ఆస్తులుగా ఉండాల్సిన ప్రభు త్వ భూములను, తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం విక్రయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం దశాబ్దాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూములను, ప్రస్తుత సర్కార్ ఒక ఆదాయ వనరుగా చూడటం ఆర్థిక నిర్వహణ వైఫల్యానికి సంకేతమని మండిపడుతున్నాయి. 

ఆ భూములకు ఎంతో డిమాండ్

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతం గా పేరున్న రాయదుర్గంలోని ప్రభుత్వ భూము ల అమ్మకానికి ఈ వేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో భూములు ఉండటం, ఐటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, కమర్షియల్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, రిటైల్ రంగాలకు అనుకూలమైన ప్రాంతం కావడంతో వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పెట్టుబడిదారులు హాట్ కేకుల్లా భూములను దక్కిం చునేందుకు సిద్ధంగా ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక 2025 అక్టోబర్‌లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఒక ఎకరా ధర రూ.177 కోట్లు పలకడం రాష్ట్ర భూ వేలా ల చరిత్రలో ఒక రికార్డు. ప్రస్తుతం ఆ ధరలు ౭౫శాతం పెరుగుతుందని టీజీఐఐసీ అంచనా వేస్తున్నది. దీనిలో భాగంగానే 11.38 ఎకరాల విలువైన భూమిని వేలం వేసేందుకు సిద్ధం చేసింది. ప్లాట్ నెంబర్ 1ఏ అండ్ 1/ఎఫ్‌లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు కలిపి.. మొత్తం 11.38 ఎకరాలకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నెల 26న భూములకు ఈ ప్రక్రియ జరుగనుంది. టీజీఐఐసీఎకరాకు సుమారు రూ.139 కోట్ల కనీస ధర నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. ఈ వేలం వెనుక ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అభివృద్ధి పేరిట ప్రభుత్వం భూములు విక్రయిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి సంక్షేమ పథకాల అమలు కోసమే నిధులు సమీకరిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది. రైతుభరోసా మూడో విడత చెల్లింపుల కోసం ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతున్నదని, ఈ నేపథ్యంలోనే సర్కార్ నిధుల సమీకరణకు భూముల విక్రయానికి పూనుకుంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భూములు అమ్మి ఎంతకాలం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ప్రభు త్వం ఖర్చుల నియంత్రణపై కఠినమైన వైఖరి అవలంబిస్తున్నది. యుద్ధప్రాతిపదికన అనవసర ఖర్చులు తగ్గించాలని, ప్రతి మంత్రిత్వ శాఖ స్వీయ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించింది. నెలవారీ ఆదాయం, వ్యయాలకు భారీ అంతరం ఉండటంతో ప్రత్యామ్నా య ఆదాయ మార్గాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ప్రభుత్వ భూముల అమ్మకం, రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ల విక్రయం, బకాయి పన్నుల వసూళ్లు, వన్‌టైం సెటిల్‌మెంట్ పథకాలపై నజర్ పెట్టింది.

మరోవైపు, మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేయడం మందుబాబుల్లో ఆందోళన కలిగిస్తున్నది. అలాగే, ప్రతిపక్షాలు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ విలువలు పెంచి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నదని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, ఉచిత పథకాల అమలు ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారిందనే చర్చ సచివాలయంలో జరుగుతున్నది. 

ఇప్పటికిప్పుడు ఆ హామీలను అమలు చేయాలంటే సర్కార్‌కు వేల కోట్ల రూపాయలు అవసరం. స్థిరమైన ఆదాయ వన రులు లేక ప్రభుత్వం అప్పులు, భూవేలాలు, ధరల పెంపులపై ఆధారపడాల్సి వస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న ఈ భూవేలాల రాజకీయం ఒక కీలక ప్రశ్నను ముందు కు తీసుకువస్తున్నది. ప్రభుత్వ ఆస్తులను అమ్మి సంక్షేమ పథకాలను నడపడం ఎంతకాలం సాధ్యమవుతుంది? అనేదే ఆ ప్రశ్న. భూముల విక్రయం తర్వాత ప్రభుత్వం ఇంకేం విక్రయిస్తుందని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.