18 May, 2026 | 2:09 AM

డెడ్‌లైన్.. మే 31

18-05-2026 01:12 AM
  1. జిల్లాలో వేగంగా మొక్కజొన్న కొనుగోళ్ళు 
  2. 90 లక్షల క్వింటాళ్ల మక్కల కొనుగోలు పూర్తి
  3. గోదాముల్లో నిలువ.. లారీల కొరతపై ప్రత్యేక దృష్టి 
  4. క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణ

నిర్మల్ మే 17 (విజయ క్రాంతి) ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుంది. ఇప్పటికి వాతావరణ శాఖ జూన్ మొదటి వారంలోని ఋతుపవనాలు తెలంగాణను తాకి వర్షాలు కురుస్తాయి సాంకేతాలు ఇచ్చింది. ఎండాకాలంలో పండిన మొక్కజొన్న పంటలు పం డించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఈసారి మొక్కజొన్న పంట  కు ప్రభుత్వం రూ. 2400 మద్దతు ధర ప్రకటించింది. బయట మార్కెట్లో క్వింటాలు మొక్క జొన్న ధర రూ.1760 రూపాయలు పలుకుతుంది.

ప్రైవేట్ కంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు విక్రయిస్తే క్విం టాల్కు రూ 640 అదనంగా వస్తుందని ఆశ తో ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు రైతులు ముగ్గుచూపుతున్నారు. నిర్మల్ జిల్లా లో మార్ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 చోట్ల మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 90 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఈ ఆసంగస్థితిలో జిల్లాలో 1,20,000 ఎకరాల్లో పంట సాగు చేయగా సుమారు లక్ష 20వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీని కనుగుణంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి 

కొనుగోలు ధాన్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి 

నిర్మల్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో మొక్కజొన్నలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావడంతో కొనుగోళ్ల పక్కన వేగంగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాం గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కు మార్, స్థానిక సంస్థల అదన కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా మార్క్ఫెడ్ అధికారి మహేష్ కు మార్, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్, సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ మొక్క కొనుగోలు పూర్తి ప్రక్రియ కార్యచరణ ప్రకటించారు.

మే 31 వరకు జిల్లాలో రైతుల మొక్కజొన్న కొనుగోలను పూర్తి చేసి వాటిని గోదాములకు తరలించి నిలువ చేసే వి ధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా మొక్కజొన్న ఎక్కువ నిల్వలు కుం టాల కుబీర్ సారంగాపూర్ తానుర్ భైంసా లోకేశ్వరం ముధోల్ నర్సాపూర్ లోకేశ్వరం తదితర మండలాల్లో పెద్ద ఎత్తున నిలువలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ కొనుగోలు ప్రక్రియ వేగంగా చర్యలు తీసుకుం టున్నారు.

ఒకేసారి వడ్లు మొక్కజొన్న చేతికి రావడంతో పంట కళ్ళల్లో నిలువలు పెరిగిన నేపథ్యంలో ముందుగా మొక్కలు తరలిస్తే ఆ తర్వాత వారి ధాన్యం కు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న ఎ క్కువగా ఉన్న కేంద్రాలను గుర్తించి బీహార్ కలకత్తా మహారాష్ట్ర కూలీలను తెప్పించి కూ లీల కొరతను లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోన సంచుల పూర్త కారణంగా ప్రవే ట్ లో రైతులు కొనుగోలు చేస్తే దానికి సం బంధించిన డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తు న్నారు.

గోను సంచులు ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ల పైఖాళీగా వెళుతున్న వాహనాలను రవాణా శాఖ అధికారులతో పట్టుకొని వాటి ద్వారా మొక్కజొ న్న బ్యాగులను సమీప గోధంలోకి తరలిస్తున్నారు. గోదాముల వద్ద మొక్కజొన్న సంచులు దించే కార్మికులను కూడా అక్కడికి పంపి ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో లారీలు ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో గోదాముల కొర త ఉన్న నేపథ్యంలో కొత్త గోదాములు ఫం క్షన్ హాలు పాత పాఠశాల భవనాలు.

ప్రైవే టు గోదాములు స్వాధీనం చేసుకుని వాటి లో సంచులను నిల్వ ఉంచుతున్నారు. మహారాష్ట్ర పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జగిత్యాల జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని అక్కడికి మొక్కజొన్నను తరలించి గోదాముల్లో నిలువ చేస్తున్నారు. ఈ పక్రియను జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రతిరోజు మార్నింగ్ చేయడంతో కథ మూడు రోజుల నుంచి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్టు రైతులు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు రవాణాలు అక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఏరోజుకారోజు నివేదికను తెప్పించుకొని మరుసటి రోజు కార్యాచరణ అమలు చేస్తున్నారు

ముందుకు వస్తున్న రైతులు 

నిర్మల్ జిల్లాలో మొక్క కొనుగోలను ఏర్పడుతున్న ఇబ్బందులను పెట్టుకొని రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఇప్పటికీ రైతులకు సూచించారు. దీంతో రైతులు స్థానికంగా ఉన్న గోదాములు ఫంక్షన్ హాలు పాత పాఠశాల భవనాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు రైతుల ట్రాక్టర్లు సాయంతో కొట్టిన బ్యాగులను అక్కడికి తరలించి నిల్వ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులందరూ గ్రూపులుగా ఏర్పడి కూలీల కొరత నేపథ్యంలో వారే కూలీలుగా మారి పంట తూకం వేయడం సంచులు కుట్టడం వంటి పనులు చేస్తున్నట్టు చెప్తున్నారు. మే 31 నిర్మల్ జిల్లాలో 100% మొక్కజొన్న కొనుగోలను పూర్తి చేసి ఆ తర్వాత వారి ధాన్యంపై ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వర్షాలు కురిసే ప్రాంతాలను గుర్తించి వర్షం కురిస్తే అక్కడిదానియానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు క్షేత్రస్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. కొనుగోల జాప్యంపై వస్తున్న పుకార్లు సోషల్ మీడియా ప్రచారం నమోవొద్దని వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో గోదాంలను గుర్తించి అక్కడికి ధాన్యం తరలిస్తున్నారు.

ప్రభుత్వ మద్దతు ధర లాభం 

మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం మాకెం తో సంతోషం కలిగించింది. ప్రైవేటు లో మొక్కలు అమ్ముకుంటే 1750 మాత్రమే చెల్లిస్తున్నారు. క్వింటాల్కు 650 రూపాయలు నష్టపోవలసి వచ్చేది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ డం వల్ల మాకు ఎంతో లాభం కలుగుతుంది. ప్రభుత్వం మొక్క కొనుగోళ్ల కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగంగా చేపడుతున్నారు. ప్రతిరోజు అధికారులు పర్యవేక్షణ చేసి కొనుగోలు ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 సింది భోజరం. రైతు 

ఈనెల ఆఖరి కి కొనుగోలు పూర్తి 

నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నలు ఈనెల 31 నాటికి కొనుగోలు పూర్తిచేసి సంచులను గోదాములకు తరలిస్తాం. నిర్మల్ జిల్లాలో ఈ ఆసంగిలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న దిగుబడులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆదేశంతో కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. రైతులు కొంత సమన్వయం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిదని తెలిపారు. ప్రవేట్ గోదాముల్లో మొక్కజొన్న నిల్వ చేస్తున్నాం. 

భవిష్ మిశ్రా. జిల్లా కలెక్టర్

రైతుల ట్రాక్టర్లను ఉపయోగించుకుంటున్నాం 

మాది కుబీర్ మండలంలోని పాలసీ గ్రామం. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పండించిన. దిగుబడి బాగానే వచ్చింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి రావడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. కూలీల లారీల కొరత కారణంగా కొంత ఇబ్బంది ఉన్న ప్రభుత్వం బీహార్ కూలీల రప్పించి కొనుగోలను వేగవంతం చేసింది. ధాన్యం తరలింపుకు గ్రామం లో గల రైతు ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నాం.

ప్రశాంత్ రైతు