చదువుతోనే ఉజ్వల భవిష్యత్
ఇంటర్ ప్రతిభావంతులకు నగదు పురస్కారం అందించిన కలెక్టర్
మహబూబాబాద్, మే 17 (విజయక్రాంతి): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువుకు పేద ధని క బేధం లేదని, విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఉద్బోధించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యా వారోత్సవాలను డీఈవో సత్యనారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అ భివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసి విద్యాభి వృద్ధికి ఉపాధ్యాయులు అధ్యాపకులు చేస్తు న్న కృషి పట్ల అభినందనలు తెలిపారు. వి ద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచాలని, విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢతను వెలికి తీసి ఉ త్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా ప్ర మాణాలను మరింత ఉన్నతంగా చేరడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయా ల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంపొందించిందని, వాటిని వినియో గిస్తూ ప్రతి విద్యార్థి అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యున్నత మార్పులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కలెక్టర్ తన సొంత డ బ్బులను నగదు పురస్కారంగా అందజేసి అ భినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇం టర్మీడియట్ అధికారి మదార్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, స్థానిక వార్డ్ కౌన్సిలర్ నీరుటి హేమ, ఏసీజీ మం దుల శ్రీరాములు , ఏ ఎఫ్ ఓ శంకర్ ,డి సి బి సెక్రటరీ బాలాజీ , డిఎస్‌ఓ అప్పారావు, కోఆర్డినేటర్లు పీ. పూర్ణచందర్, జీ.విజయ కుమారి, వంగ సురేష్, డిసిబి అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సతీష్ కార్యాలయ సూపరిండెంట్ ఉమామహేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసు, ఎస్ బి శ్రీనివాసు, ఎంఈఓ లు కళాశాలల ప్రిన్సిపల్ లు,హె డ్మాస్టర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.






