18 May, 2026 | 3:46 AM

పేదరికాన్ని రూపుమాపే శక్తివంతమైన ఆయుధమే విద్య

18-05-2026 02:40 AM
  1. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
  2. అక్షర జ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుంది
  3. విద్యారంగంలో ములుగు జిల్లాకు విశిష్ట గౌరవం లభించింది
  4. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క 

ములుగు (మహబూబాబాద్) మే 17 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయికి మించిన నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నామని, పేదరికం రూపుమాపే శక్తివంత మైన ఆయుధం విద్య అని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, అక్షర జ్ఞానం మనిషిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందని, విద్యారంగంలో ములుగు జిల్లా కు రాష్ట్రంలో విశిష్ట గౌరవం లభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక వి ద్యా వారోత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో  వి ద్య విజయోత్సవ దినోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి మంత్రి  సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు అవార్డులు,ప్రశంసా పత్రా లు, తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయ ల నగదు ప్రోత్సాహం, పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రథమ స్థానం లో నిలిచిన విద్యార్థులకు మంత్రి అనసూ య సీతక్క లాప్ టాప్ లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి  సీతక్క మాట్లాడుతూ ప్రజా పాలన లక్ష్యాలకు అనుగుణం గా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విడుద లైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ము లుగు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానం లో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యా రంగంలో ములుగు జిల్లా సాధిస్తున్న పురోగతిని మంత్రి కొనియాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిట ల్ తరగతుల ఏర్పాటు, ప్రత్యేక ప్రణాళిక, ఉ పాధ్యాయుల తల్లిదండ్రుల కృషి వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. విద్యార్థుల విజయానికి నిరంతర కృషి, సాధన ఎంతో అవసరమని పేర్కొన్నారు. వైఫల్యాలకు కుం గిపోకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫలితాలలో బాలికలే ఎక్కువ సంఖ్యలో సాధించిన విజయాలను అభినందిస్తూ,

ములుగు జిల్లాకు చారిత్రాత్మక నేపథ్యం ఉందని, సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమదేవి వంటి వీరనారుల స్ఫూర్తితో విద్యార్థులు మరింతగా రాణించాలని కోరారు. ఏటూరునాగారంలో పారిశుధ్య కార్మికుడి కుటుంబం గ్రూప్ వన్ ఆఫీసర్   గా ఎంపికైన ప్రవీణ్ కుమార్, టైర్ల షాపు నడుపుకునే వ్యక్తి కుమార్తె మల్లంపల్లికి చెందిన అమ్మాయి డీఎస్పీ గా ఎంపికైన వా రి వృత్తాంతాలను ఉదహరిస్తూ, కష్టపడి చదివితే ఎలాంటి నేపథ్యం ఉన్నవారైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని నిరూపించారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ భానుత రవిచందర్, జిల్లా విద్యాధికారి సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వీరేందర్, డిసిఇబి కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కోఆ ర్డినేటర్లు శ్యామ్ సుందర్ రెడ్డి, రజిత, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్, టాస్ ఉల్లాస్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు, మండల వి ద్యాశాఖ అధికారులు వజ్జా తిరుపతి, కొయ్యడ మల్లయ్య, సాంబశివరావు, అవా ర్డు పొందిన విద్యార్థులు  తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.