16 April, 2026 | 4:01 AM

రఘునాథగూడెంలో ఘనంగా కోదండ రామాలయ రెండో వార్షికోత్సవం

16-04-2026 12:32 AM

కల్లూరు, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): మండలం లోని రఘునాధగూడెం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచ్ కర్నాటి కోటేశ్వరి, రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఐక్యతతో నిర్మించుకున్న

ఆలయం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందకరమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, అభివృద్ధితో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు కర్నాటి రామకృష్ణారెడ్డి, పాశం నాగేశ్వరరావు, పొనుగుమాటి శ్రీనివాసరావు, బలుసుపాటి జగ్గయ్య,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.