అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
- ఎల్లారెడ్డి బీసీ గరల్స్‌హాస్టల్‌లో ఉంటున్న శ్రావణి
- గుండెపోటుతోనే చనిపోయిందన్న సిబ్బంది
- ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అఖిలపక్ష నేతల ఆందోళన
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న 8వ తరగతి విద్యార్థిని శ్రావణి(14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పట్ల బుధవారం అఖిలపక్ష నాయ కులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన శ్రావణి మొదట గుండెపోటుతో మరణించిందని సిబ్బంది చెబుతున్నారు.
అయితే తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపించాలని బాలిక కుటుంబ సభ్యులు ఆరో పించారు. వారికి మద్దతుగా పలు రాజకీయ పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు, బీజేపీ నాయకులు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో ఏ అధికారి ఎక్కడ విధులు నిర్వహిస్తున్నాడో తెలియని పరిస్థితి ఉందని మండి పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రావణి మృతి చెందిందని,విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా అఖిలపక్ష నాయకులు మండల కేంద్రంలో ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకుల అరెస్ట్‌పై పలు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇందులో భాగంగా గురువారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార వాణిజ్య వర్గాలు బంద్‌కు పూర్తిగా సహకరించగలరని పట్టణ ప్రజలను కోరారు. మృతి చెందిన విద్యా ర్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. శ్రావణి ఉన్నట్టుండి హఠాత్తుగా మృతి చెందడం ఆ సమయానికి వసతి గృహంలో ఎవరూ లేకపోవడం ఆ విద్యార్థిని మృతికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.
శ్రావణి కుటుంబానికి, ఆమె తల్లిదం డ్రులకు ప్రభుత్వం పూర్తి సహాయం అందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పలువురు మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులు పలువురు బంధువులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని మరణం విషాదకరం: కేటీఆర్
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించ డం అత్యంత విషాదకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బాధాకరమైన ఘటనకు పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్ రెడ్డిదే అని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
ఉన్నత విద్యా ప్రమాణాలను కాలరాసి చివరికి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు సర్కారు నిర్వాకం వల్ల కన్నుమూసినా మానవత్వం లేని ము ఖ్యమంత్రిలో కనీస చలనం లేదని మండిపడ్డారు.
విద్యార్థిని శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతిఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించి అన్ని విధాలా ఆదు కోవాలని సూచించారు.






