7 May, 2026 | 6:38 PM

వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి

07-05-2026 05:41 PM

జిల్లా సిపిఐ ఇంచార్జ్ తోటపల్లి శంకర్.                                    

జవహర్ నగర్, మే 7 (విజయక్రాంతి): జవహర్ నగర్ ప్రధాన రహదారుల వద్ద ఉన్న వైన్ షాపుల దగ్గర అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను నివారించడని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని వివిధ వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ల పై సిపిఐ ఆధ్వర్యంలో జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కు గురువారం తోటపల్లి శంకర్ పార్టీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నిలపడం వల్ల అటుగా వెళ్లే బస్సులు ఇతర వాహనాలు నిలిచిపోతున్నాయని ముఖ్యంగా పాదచారులు నడవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జవహర్ నగర్ పోలీస్ ట్రాఫిక్ నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ ఈ నిర్దిష్ట ప్రాంతాల్లో వైన్ షాప్ ల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వైన్ షాపుల యాజమాన్యాలు పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా రోడ్లను ఆక్రమించడం చట్టం విరుద్దమని తక్షణమే పోలీసులు స్పందించి సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూప నాయక్, గిరి ప్రసాద్ నగర్ కార్యదర్శి కొండా సత్యం సాగర్, ఏఐటీయూసీ నాయకులు అంబాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.