28 February, 2026 | 9:33 PM

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం

28-02-2026 06:56 PM

పొడిచన్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ

పాపన్నపేట: విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి వివిధ రకాల నమూనాలతో ప్రదర్శనలు నిర్వహించామని శ్రీవిద్య పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన పాపన్నపేటలోని శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా జాతీయ దినోత్సవం జరుపుకున్నారు.

భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను  ప్రకటించిన జ్ఞాపకార్ధంగా సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులు వివిధ నమూనాలు తయారుచేసి వాటి ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నిటలాక్ష్యప్ప, సుమన్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ..

మండల పరిధిలోని పొడిచన్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 2003-04 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులైన నరని సంతోష్ రెడ్డి, దుర్గారెడ్డి, వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ తో పాటు ఇతర విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, యువకులు, పాల్గొన్నారు.